lit your wisdom

నీలో దీపం వెలిగించూ…నీకై జాతిని రక్షించూ…
నీలో దీపం వెలిగించూ…
జీవం సమసే..జీవన గమనం..నెరపిన చేటును గమనించూ…
నీలో దీపం వెలిగించూ…
గడపను దాటక,గరళమునాపిన పరమేశుని నువు ధ్యానించు..
నీలో దీపం వెలిగించూ…
ధైర్యము నొదలక,పర దరి చేరక,మనోధారివై గర్వించు…
నీలో దీపం వెలిగించూ…నీకై జాతిని రక్షించూ…నీలో దీపం వెలిగించూ…

Leave your comment

Your email address will not be published. Required fields are marked *