టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇవాళ కోకాపేట భూముల సందర్శనకు వెళతానని ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచి భారీగా పోలీసులను మొహరించారు. రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధం చేసి.. ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.
తెల్లవారుజామునే మొహరింపు.. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి తెల్లవారుజామున పోలీసులు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిచింది. ఆ క్రమంలోనే ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు కూడా కోకాపేట భూముల సంద్శనకు వెళ్లడానికి సమాయత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భూముల సందర్శనకు వెళ్లే నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు భారీగా మోహరించారు.
భారీగా ఆదాయం.. అవినీతి జరిగిందని కోకాపేట, ఖానామెట్ భూముల విక్రయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఇందులో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ క్రమంలోనే సందర్శనకు వెళ్లేందుకు పిలుపునివ్వగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు కోకాపేట భూముల కంటే.. ఖానామెట్ భూములు ఎక్కువ ధర పలికాయి. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించగా.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలికింది.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. యావరెజిగా ఎకరానికి రూ. 40.05 కోట్లు పలికింది. Srinivas-i923

Leave your comment

Your email address will not be published. Required fields are marked *