ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని హిమాయత్‌ సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తుంది. భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత కొన్ని రోజులు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మూసీ నది నుంచి వస్తున్న భారీ వరద హిమాయత్‌సాగర్‌లోకి చేరుతోంది. రాష్ట్రంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జలాశయంలోకి వరదనీరు రాక ఇలాగే కొనసాగితే సాగర్ గేట్లు ఎత్తేసి నీటిని కిందికి విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.సాగర్‌ గేట్లు ఎత్తితే వరదనీరు మూసీ నదిలో వచ్చి చేరుతుంది. హిమాయత్‌ సాగర్‌లోకి ప్రస్తుతం 1666 క్యూసెక్కుల నీరు వస్తుంది. సాగర్‌ గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.60 అడుగులకు చేరింది. జంట జలాశయాల్లో మరొకటైన ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1784.60 అడుగు వద్ద నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. Srinivas-i923

Leave your comment

Your email address will not be published. Required fields are marked *