హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తీర్చిదిద్దుతామని చెబుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా తన పని చేసుకుంటూ పోతుంది.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో హైదరాబాద్ సిటీ మరింత స్మార్ట్ గా మారుతుంది.ఈ క్రమంలోనే నగరంలో మునుపెన్నడూ చూడని డెవలప్మెంట్ కనిపిస్తోంది ముఖ్యంగా ఇటీవల కాలంలో నిర్మించిన ఫ్లఓవర్లు భాగ్యనగరానికి మరింత ఎక్కువ శోభను తీసుకొస్తున్నాయి.
తాజాగా నగరంలో పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత రెండో అతి పొడవైన ఫ్లైఓవర్ గా గుర్తింపు పొందిన షేక్ పేట వంతెన మార్గాన్ని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు న్యూఇయర్ రోజున ప్రారంభించారు.
అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది దీనికి సంబంధించి నైట్ విజువల్స్ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ల షేర్ చేయగా చేయగా ఈ ఫోటోలు చూసి వాళ్ళు హైదరాబాద్ ను చూస్తుంటే దుబాయ్ సింగపూర్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.ఆ రోడ్లు లైటింగ్ చూస్తుంటే విదేశాల్లో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతోందని అంటున్నారు.సుమారు 350 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టోలిచౌకి నుండి షేక్ పేట రాయదుర్గం దాదాపు మూడు కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లై ఓవర్ వల్ల మెహదిపట్నం హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ ఇక్కట్లు తొలగనున్నాయి. Nivas

Leave your comment

Your email address will not be published.