తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కేసును సీసీఎస్‌ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో తెలుగు అకాడమీ, బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత రూ.43 కోట్ల నిధులు గల్లంతైనట్టు భావించినా.. తవ్వేకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ రూ.70 కోట్లకుపైగా గల్లంతైనట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖ నుంచే అక్రమార్కులు రూ.43 కోట్లు కాజేశారు. సంతోష్ నగర్ బ్రాంచ్‌లో రూ. ఎనిమిది కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ నుంచి రూ. 9 కోట్లు గల్లంతైనట్టు వెల్లడయ్యింది. ప్రధాన సూత్రధారి తోపాటు మరో అనుమానితుడిని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.
కెనరా బ్యాంక్ చందానగర్ బ్రాంచ్ నుంచి రూ.9 కోట్లు ఇతరుల సహాయంతో కాజేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. కెనరా బ్యాంక్‌కు సంబంధించి శుక్రవారం మరో ఫిర్యాదు దాఖలు చేయనున్న తెలుగు అకాడమీ పేర్కొంది. త్రిసభ్య కమిటీ విచారణలో అకాడమీ అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. జీహెచ్ఎంసి పరిధిలో 10 ప్రభుత్వ బ్యాంకులకు చెందిన 30 బ్రాంచీలలో తెలుగు అకాడమీకి చెందిన రూ. 320 కోట్ల నిధుల డిపాజిట్లు ఉన్నాయి.చందానగర్ కెనరా బ్యాంకులోని రూ.33 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లలో ఇటీవలే రూ. 20 కోట్లు తెలుగు అకాడమీ అధికారులు విత్ డ్రా చేసినట్లు సమాచారం. తెలుగు అకాడమీ అధికారుల బృందం నిధులు డిపాజిట్ చేసిన 30 బ్యాంకుల శాఖలకు శుక్రవారం వెళ్లి వాటి భద్రతను పరిశీలించనున్నారు. తెలుగు అకాడమీ అధికారుల విచారణ పూర్తికావడంతో నేడు యూనియన్ బ్యాంక్ అధికారులను త్రిసభ్య కమిటీ విచారించనుంది. అనంతరం ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి శనివారం సమర్పించనుంది.ఈ కుంభకోణానికి సంబంధించి తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి మూడు ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాయమైన నిధులు ఎక్కడికి తరలించారు? అన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. నిధుల గోల్ మాల్‌లో అకాడమీ, బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల నిర్దారణకు వచ్చారు. అకాడమీలోని ముగ్గురు ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. NivaSri

Leave your comment

Your email address will not be published. Required fields are marked *