తెలంగాణలో కొత్తగా 578 కరోనా కేసులు, 3 మరణాలు తాజాగా, నమోదైన 578 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,36,627కు చేరింది. కరోనాతో కొత్తగా ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3759కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.
తెలంగాణలో 9,824కి తగ్గిన యాక్టివ్ కేసులు గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,23,044కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,824 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.86 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో 90,966 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 578 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది. Srinivas-i923

Leave your comment

Your email address will not be published. Required fields are marked *