వాన.. వర్షమొస్తే చాలు ఆ ఆనందమే వేరు.. చిన్న పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటారు. పెద్దలు చూసి మురసిపోతారు. అన్నదాతల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వర్షమే వారి జీవనాధారం. వాన కోసం ఆకాశం వైపు చూసి.. వర్షం రావడంతో మనసులోనే తెగ సంబరపడిపోతారు. అలా ఓ రైతు డ్యాన్స్ చేశారు. అదీ కూడా వర్షంలో తడుస్తూ.. గొడుగు పట్టుకొని మరీ చిందులేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఆ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.
పిల్లాడిలా డాన్స్.. వర్షానికి ఆ తాత చిన్న పిల్లాడు అయిపోయాడు. గొడుగు పట్టుకొని మరీ డ్యాన్స్ చేశాడు. లేటు వయసులో స్టెప్పులతో ఇరగదీశాడు. వాన వాన వల్లప్ప అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో రాగా.. తాత మంచి ఊపు ఉన్నాడు. వర్షానికే సంబరపడిపోయి.. కాళ్లు, శరీరం తన్వయత్వంతో కదిలింది. యూత్ చేసే స్టెప్పులు కూడా అలవోకగా చేశాడు. ఆ పాటను చూసిన నెటిజన్లు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. వామ్మో.. తాత స్పీడ్ మాములుగా లేదు అంటూ కామెంట్ చేశారు. కానీ అతని స్టెప్స్ మాత్రం చూసిన అందరినీ మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి.
లేటు వయసులో.. లేటు వయసులో కూడా స్టెప్పులతో అట్రాక్ట్ చేశాడు తాత. వర్షంలో తడుస్తూ మరీ, పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశాడు. యువత కూడా చేయని విధంగా స్టెప్పులేశాడు. దీనిని చూసి నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కామెంట్ చేసి.. వావ్ తాత అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ డ్యాన్స్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో జరిగి ఉంటుంది. కానీ ఎక్కడో మాత్రం తెలియలేదు. Srinivas-i923

Leave your comment

Your email address will not be published. Required fields are marked *